RR: మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం బస్ స్టాప్‌లో ఏర్పాటు చేసిన మదర్ ఫిడింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లి, బిడ్డల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యం అందించడమే మా ధ్యేయమని పేర్కొన్నారు.