SRPT: 2025-26 రబీ సీజన్లో 4.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం మిల్లర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాత బకాయిలను వెంటనే చెల్లించి, జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్ సమర్పించిన వారికే ధాన్యం కేటాయిస్తామని తెలిపారు.