VZM: జొన్నాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)ను డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం సందర్శించి కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై డిపాజిట్లు పెంచడం, ఋణ పోర్ట్ఫోలియో విస్తరణపై పలు సూచనలు చేశారు. ఋణాల మంజూరులో డ్యూ డిలిజెన్స్ పాటించి రికవరీలు మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు.