JN: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలకు చెందిన పేరాల భవాని ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. టైలరింగ్ చేస్తూ కుమార్తెను చదివిస్తున్న తండ్రి ప్రభాకర్ కష్టాన్ని గుర్తించి భవాని కష్టపడి చదివి 1000కి 988 మార్కులు సాధించింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన భవాని అత్యధిక మార్కులు సాధించడంతో గ్రామస్థులు, పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.