NLG: జిల్లా వ్యాప్తంగా రబీ ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాలకు పోటెత్తాయి. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో సుమారు 140 కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, పలుచోట్ల కొనుగోళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. అకాల వర్షాల భయం, నిల్వ సౌకర్యం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం సేకరణను ప్రారంభించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.