యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్ డెబ్యూ చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అదే నిజమైతే సచిన్ ఆల్టైమ్ రికార్డ్ అతని సొంతమవుతుంది. భారత్ తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్(16Y 206D) కొనసాగుతున్నాడు. ఇవాళ్టికి వైభవ్ వయసు 15Y 18D. వైభవ్ రానున్న సంవత్సరన్నర కాలంలో అరంగేట్రం చేసినా.. సచిన్ రికార్డ్ బ్రేక్ అవుతుంది.