T20 WC సెమీస్లో తలపడే జట్లు ఖరారైన సంగతి తెలిసిందే. ఈనెల 4న సౌతాఫ్రికా-న్యూజిలాండ్.. 5న భారత్-ఇంగ్లండ్ ఢీకొననున్నాయి. అయితే ఈ సారి సెమీస్కు చేరిన ఈ 4 జట్లలో భారత్(ఆసియా), సౌతాఫ్రికా(ఆఫ్రికా), న్యూజిలాండ్(ఓషియానియా), ఇంగ్లండ్(యూరోప్) 4 వేర్వేరు ఖండాలకు చెందినవి కావడం విశేషం. 2016 తర్వాత ఇలా జరగడం ఇది రెండో సారి కాగా 4 జట్ల సారథులు కూడా కొత్తవారే కావడం గమనార్హం.