IPLలో మ్యాచుల ఆలస్యం, కెప్టెన్లకు జరిమానా సహజంగా మారిపోయాయి. అయితే స్లో ఓవర్ రేట్‌కు ప్లేయర్లనే బాధ్యులను చేయడం సరికాదని క్రికెట్ నియమాలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ పేర్కొంది. అంపైర్ల వల్లే ఆలస్యమవుతోందని, త్వరగా ఆటను ముగించడం వారి బాధ్యతే కాబట్టి వారికే ఫైన్ విధించాలని క్లబ్ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్ సూచించారు. అప్పుడే మ్యాచులు వేగంగా జరుగుతాయన్నారు.