AP: MLA కొలికపూడి శ్రీనివాస్, YCP నేత శావల దేవదత్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. MP కేశినేని చిన్ని, దేవదత్ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఆ సెటిల్మెంట్ లోకేష్ వద్దకు వెళ్లిందని కొలికపూడి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను దేవదత్ తీవ్రంగా ఖండించారు. ఎంపీ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొలికపూడి కుట్ర చేస్తున్నారని, తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, తీసుకోలేదని స్పష్టం చేశారు.