AP: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుని మంత్రి లోకేష్ ఫోన్లో పరామర్శించారు. యనమల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో యనమల గుండెకు వైద్యులు స్టెంట్ వేశారు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.