TG: BRS వలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చిక్కుకున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. రాజ్యసభ అవకాశం దొరకలేదనే ఆయన కాంగ్రెస్ను వీడారన్నారు. బీఆర్ఎస్లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదని చెప్పారు. జీవన్ రెడ్డికి అలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన రోజే పండగ.. తర్వాత అంతా దండగేనని వ్యాఖ్యానించారు.