TG: NH65పై పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు R&B శాఖ డిజైన్ చేసిన డబుల్ డెకర్ నిర్మాణం శాశ్వత పరిష్కారం చూపనుంది. దీనివల్ల వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో మెట్రో కోసం రోడ్డు విస్తరణ ఇబ్బందులు తప్పుతాయి. బేగంపేట తరహాలో ఇళ్ల సమీపంలో మెట్రో పిల్లర్లు రాకుండా, సర్వీసు రోడ్డులో స్తంభాల అడ్డంకి లేకుండా ప్లాన్ చేశారు. కేంద్ర ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.