TG: మాజీ మావోయిస్టు దేవ్ జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము లొంగిపోలేదని.. మొదటి నుంచి జనజీవన స్రవంతిలోనే ఉన్నామని తెలిపారు. పార్టీ కీలక సమయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. మావోయిస్టు పార్టీని విస్తరించడంలో విఫలమయ్యామని వెల్లడించారు. ఆపరేషన్ కగార్ అనేది చాలా చిన్న విషయమన్నారు.