తాను పిల్లలను రిస్కులు తీసుకునేలా, ధైర్యంగా పెంచే రఫ్ తండ్రినని రామ్ చరణ్ తెలిపాడు. పిల్లలు మట్టిలో ఆడినా, దూకినా ప్రోత్సహిస్తాను, వాళ్లు ధైర్యం కోసం తన దగ్గరకు వస్తారని అన్నాడు. తన ముగ్గురు పిల్లలే తన ప్రాణమని, వారు ఇంట్లో లేకపోతే గుండె ఆగిపోయినట్లు ఉంటుందని ఎమోషనల్ అయ్యాడు. స్టార్డమ్ ఉన్నా, పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే తండ్రిగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు.