రచయిత సాయి మాధవ్ బుర్రా SM వేదికగా సంచలన పోస్ట్ చేశాడు. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా కథను ఇష్టమొచ్చినట్టు మార్చేశారు. నా కథను మానభంగం చేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఏ సినిమాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టం చేయలేదు. ‘సరస్వతి’ చిత్రం గురించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.