సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా అడుగుపెట్టి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇన్ని ఏళ్లయినా ఇప్పటికీ కెరీర్ను ఇప్పుడే మొదలుపెడుతున్నట్లుగా ఉందని, కొత్త ఉత్సాహంతో ఉన్నానని తెలిపింది. ముఖ్యంగా నటీమణులకు ఇలాంటి సుదీర్ఘ కెరీర్ దొరకడం అరుదని, తనకు ఆ అవకాశం రావడం ఆనందంగా ఉందని ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.