NTR: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విజయవాడ నగరంలోని విద్యార్థులకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం ఆదేశాల మేరకు పటిష్టమైన ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు పూర్తైన అనంతరం విద్యార్థులు సురక్షితంగా, సులభంగా తమ ఇళ్లకు వెళ్లే క్రమంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.