BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, అన్ని శాఖ అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 52 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. దరఖాస్తులు జాప్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు.