NRML: జిల్లాలో రైతులు కూరగాయల పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో రైతులకు ఐదు రకాల కూరగాయల విత్తనాలు కలిగిన ఉచిత కిట్లను అందజేశారు. ఈ విత్తనాలు అర ఎకరంలో సాగుకు సరిపోతాయని, రైతులు వీటిని వినియోగించి నాణ్యమైన కూరగాయల ఉత్పత్తి చేయాలని కలెక్టర్ సూచించారు.