NLG: దేవరకొండలో SFI డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ నెల 20న ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అన్నారు. విద్య అనేది సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ సారి నిధులు పెంచాలని వారు కోరారు.