కర్నూల్: ప్రభుత్వాసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ సుందర్ రాజు రూ. 5 లక్షలు తీసుకుని మోసం చేశాడని శ్రీరామ్ నగర్ చెందిన నాగమణి సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడగడానికి వెళ్లినప్పుడు కుక్కను వదిలి బెదిరించాడని ఆమె ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.