టీమిండియా యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఐసీసీ T20 WCలో ఆడకపోవడం తనకు బాధగా ఉందని కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. టీంకాంబినేషన్లో భాగంగా చివరి నిమిషంలో అతను జట్టుకు దూరమయ్యాడన్నాడు. జట్టుకు ఇషాన్ కిషన్ అవసరం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాడు. కాగా, మెగా టోర్నీకి ముందు జితేష్ స్థానంలో సెలెక్టర్లు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.