కడప అమీన్ పీర్ దర్గాను ‘పుష్ప’ సినిమా నటుడు జగదీష్ ఇవాళ సందర్శించారు. దర్గా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్న జగదీష్, ఇది తనకు మూడోసారి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రేపు విడుదల కానున్న తన ‘తెర చేప’ సినిమాను ప్రజలందరూ ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.