KDP: తొండూరు మండలం మల్లేల గ్రామంలోని ఇమాంబి దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉరుసు సందర్భంగా శనివారం రాత్రి మేళ తాళాల వాయిద్యాలు, గుర్రాలతో గంధం ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ఖవ్వాలి పోటీ జరగనుంది. ఉరుసు ఉత్సవాల్లో కడప, అనంతపురం, కర్నూలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.