W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 ని.ల వరకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూర ప్రాంతాల వారు టోల్ ఫ్రీ నం. 1100, వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.