NRPT: మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్, ఎస్బీఐ సమీపంలో మురికి కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. చెత్త పేరుకుపోయి నిల్వ నీటితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల పెరుగుదలతో రోగాల బారిన పడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. తక్షణమే కాలువలను శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు.