PPM: గుమ్మలక్ష్మీపురం విశ్రాంత ఉపాధ్యాయుడు జగన్నాధరథో తన ఉదారతను చాటుకున్నారు. భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఆయన, అక్కడ ఫ్యాన్లు లేక రోగులు, వారి కుటుంబ సభ్యులు ఉక్కపోతతో పడుతున్న ఇబ్బందులను గమనించారు. వెంటనే స్పందించి, ఆదివారం ఆరు కొత్త ఫ్యాన్లను కొనుగోలు చేసి ఆసుపత్రికి విరాళంగా అందించారు.