కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన బయటపడింది. మొదటి సంవత్సరం విద్యార్థిని మూడో సంవత్సరం విద్యార్థి వేధించాడని ఫిర్యాదు చేశాడు. యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితుడు ఎన్ఎంసీని ఆశ్రయించాడు. అనంతరం యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టి ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. నివేదిక మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.