బాపట్ల జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఇది మీకోసం మాత్రమే కాదు, మీ కుటుంబం కోసం కూడా. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. ట్రాఫిక్ నియమాలు పాటించండి, హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి చేరుకోండి అని సూచిస్తున్నారు.