విశాఖ పౌర గ్రంథాలయంలో ‘తెలుగు దండు’ ఆధ్వర్యంలో “మాతృభాషాభివృద్ధికి మార్గమేది?” అంశంపై ఆదివారం సమాలోచన జరిగింది. విద్యార్థినుల నృత్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, విద్యావేత్తలు తెలుగు భాషా పరిరక్షణపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాతృభాషాభివృద్ధికి ఉన్న సవాళ్లను విశ్లేషించారు.