KRNL: మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని ఇవాళ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నాగేంద్ర అన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ బిల్లు అవసరమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు కలిసి బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.