BHPL: టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి కన్నూరి సృజన్య రాణి ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల కీర్తి రెడ్డి మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో BJP నేతలు ఉన్నారు.