SKLM: సంతబొమ్మాళి మండలం లక్కీవలస పంచాయతీ పరిధిలోని పిట్టవానిపేట, గొలుగువానిపేట, గెద్దలపాడు గ్రామాలకు చెందిన మత్స్యకారులు తమబోట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వేట సమయంలో ప్రమాదాలు సంభవిస్తే ‘ప్రమాద బీమా’ వర్తిస్తుందని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.