KMM: ఎర్రుపాలెంలో తీవ్రమైన ఎండల నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని ప్రారంభించారు. ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ షేక్ శభాష్, వార్డు సభ్యులు బాలరాజు, అంజమ్మ, శీలవేణి, నాయకులు షేక్ ఇస్మాయిల్, కంచర్ల వెంకట నరసయ్య తదితరులు హాజరయ్యారు.