ప్రకాశం: పొదిలిలోని తహసీల్దారు కార్యాలయం వీధి, తూర్పు పాలెం ప్రాంతాల్లో 15 రోజులుగా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు వచ్చే నీరు కూడా మట్టి మట్టిగా ఉండటంతో తాగడానికి పనికిరావడం లేదు. నీటి సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు నీళ్లు సేకరించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడమే కారణమని వాపోతున్నారు.