MLG: తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ప్రారంభించి లబ్ధిదారులను సన్మానించారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు అన్నారు.