AKP: కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపల్, మండల కార్యాలయాల్లో ఈనెల 20 తేదీన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాలేని వారు అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.