VZM: గజపతినగరం అగ్నిమాపక కేంద్ర ఇంఛార్జ్ అధికారి సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బెల్లాన హాస్పిటల్ వద్ద ఏసీలు, ఐసీయూల వద్ద ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నివారణ చర్యలను సిబ్బంది ప్రాక్టికల్‌గా చేసి చూపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.