ASF: ఈ నెల 21వ తేదీన కాగజ్ నగర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కూలీలకు గత మూడు నెలల పని వేతనం, ఏడాదిలో 200 రోజులు పనిదినాలుగా కల్పించాలని, పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.