ELR: ఎంపీ పుట్టా మహేష్ ఆదివారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి, సత్కరించి ఇటీవల జరిగిన పరిణామాలపై ఎంపీకి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ అత్యంత నిజాయితీ, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే మనస్తత్వం కలిగిన యువ నాయకుడన్నారు.