SRCL: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం పిల్లల తల్లులతో మాట్లాడారు.