MDK: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ చిన్నశంకరంపేట్ మండలం సూరారం జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి, సబ్జెక్టులవారీగా చదివే విధానం వివరించారు. తల్లిదండ్రులు హాజరుపై దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రోత్సహించాలని అన్నారు.