అఫ్గానిస్థాన్తో జరగబోయే వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దూరం కానున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కాటే స్పందించాడు. తాము అధికారికంగా చెప్పే వరకు ఎలాంటి వార్తలను నమ్మకూడదని అతడు కోరాడు. రోహిత్, కోహ్లీ ఈ సిరీస్లో ఆడతారా? లేదా? అనే విషయంపై వైద్యుల నివేదికలు వచ్చిన తర్వాత తామే స్పష్టత ఇస్తామని పేర్కొన్నాడు.