AP: రాష్ట్రంలో కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లను పంపిణీ చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఏటా పింఛన్లకు ప్రభుత్వం రూ.34 వేల కోట్లు పంపిణీ చేస్తోందని, ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ.65,886 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లగుంటలో NTR భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికెళ్లి స్వయంగా పెన్షన్లను అందజేశారు.