AP: రాజమండ్రిలో పాల కల్తీ, శ్రీకాకుళంలో డయేరియా ఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఒక్కో అంశంపై లఘు చర్చ చేపడదామని, దీనికి సంబంధించి అంశాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.