PDPL: ఎలిగేడు మండలం దులికట్ట గ్రామానికి చెందిన భూసారపు కొమురయ్య గౌడ్ (58) తాడిచెట్టు ఎక్కుతుండగా కాలుజారి కిందపడిపోయాడు. ఆయనను కరీంనగర్లోని ప్రతిమ హాస్పిటల్కు తరలించగా కుడికాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న ఆయనకు తక్షణ సహాయం అందించాలని గౌడ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు.