NRML: అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ప్రజలకు అగ్నిప్రమాదం ఏర్పడినప్పుడు ఎలా తమను తాను రక్షించుకోవాలో డెమో ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది జావేద్ అలీ హుస్సేన్ షా ఉన్నారు.