NRPT: భారత రాజ్యాంగ నిర్మాత, డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ నివాళులు తెలిపారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలతో సమాజాన్ని ముందుకు నడిపించిన ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడం మన అందరి బాధ్యత అని తెలిపారు.