NRPT: మక్తల్‌లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, మైనార్టీ గురుకుల కాలేజ్, స్కాలర్స్ ప్రైవేటు జూనియర్ కాలేజ్‌లలో పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 2,000 విద్యార్థులు, ఒకేషనల్ పరీక్షలకు 141 మంది పాల్గొంటున్నారు. శాంతిభద్రతల కోసం సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు SI తెలిపారు.