PDPL: ధర్మారం మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొని విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలు సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం కోసం ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.